ఆకట్టుకుంటోన్న ప్రియమణి లేటెస్ట్‌ ఫొటో షూట్‌..!

2007లో యమదొంగ చిత్రంతో టాలీవుడ్‌ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాలతార ప్రియమణి. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక తాజాగా పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక ఓ వైపు సినిమాలు, రియాలిటీషోలలో నటిస్తూనే మరోవైపు ఫొటో షూట్‌లతోనూ అలరిస్తోందీ అమ్మడు. 36 ఏళ్ల వయసులోనూ తన హాట్‌ లుక్స్‌ తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రియమణి పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రెడ్‌ కలర్‌ చెక్స్‌ షర్ట్‌, జీన్స్‌ ప్యాంట్‌ ధరించి దిగిన ఫొటోలలో ప్రియమణి చాలా అందంగా కనిపిస్తోంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. ఇక కెరీర్‌ విషయానికొస్తే ప్రియమణి ప్రస్తుతం.. విరాట పర్వం చిత్రంలో భారతక్క పాత్రలో, నారప్ప సినిమాలో వెంకటేష్‌కు జోడిగా నటిస్తోంది వీటితోపాటు హిందీలో మైదాన్‌ చిత్రంలో నటిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here