బీహార్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ప్ర‌ధాని మోదీ ఆస‌క్తిక‌ర ట్వీట్‌..

దేశం మొత్తం బీహార్ వైపు చూస్తున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. బీహార్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి అంటూ ఆయ‌న కామెంట్ చేశారు.

బీహార్ ఓట‌ర్ల‌కు మోదీ స‌ల‌హా ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఓటర్లు ఓటు వేసేటపుడు కొవిడ్-19 మార్గదర్శకాలను త‌ప్ప‌కుండా పాటించాలని మోదీ కోరారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనాలని ఓటర్లందరినీ నేను కోరుతున్నానని మోదీ ట్వీట్ చేశారు. బీహార్‌లో మొద‌టి ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని 71 అసెంబ్లీ స్థానాల‌కు నేడు పోలింగ్ జ‌రుగ‌నుంది.

రెండో ద‌శ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 3, మూడో ద‌శ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 8న జ‌రుగనున్న విష‌యం తెలిసిందే. ఇక ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించి అధికారులు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. ప్ర‌ధానంగా క‌రోనా నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా హ్యాండ్ శానిటైజ‌ర్లు ఏర్పాటుచేశారు. ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మీష‌న్ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇక రాజ‌కీయ పార్టీలు సైతం హోరాహోరీగా ప్ర‌చారం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌పై బీజేపీ కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here