‘మహానటే’ చిరు చెల్లి..!

సైరా నర్సింహా రెడ్డి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే కొరటాల శివతో ఆచార్య.. వినాయక్‌ డైరెక్షన్‌లో లూసిఫర్‌ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌లతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా వేదాళం రీమేక్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఈ సినిమాలో చెల్లి పాత్రకు ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది. ఈ కారణంగానే ఇందుకోసం టాప్ ‌హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్‌ భావిస్తోందని.. అందులో భాగంగానే కీర్తి సురేష్‌, సాయి పల్లవి పేర్లు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరు చెల్లిగా మహానటితో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌ ను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో చెల్లి పాత్రలో నటించడానికి కీర్తి ఓకే చెప్పడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే చిరంజీవి సినిమాలో నటించాలనే ఆసక్తితోనే కీర్తి ఇందుకు ఓకే చెప్పినట్లు టాక్‌. మరి ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటిస్తోందా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక ఆచార్య తర్వాత చిరు లూసిఫర్‌ రీమేక్‌ను మొదలు పెడతాడా.?లేదా వేదాళం రీమేక్‌ను మొదలు పెడతాడా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here