వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించే వారితో చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌న్న ప్ర‌ధాని మోదీ..

దేశంలో వ్య‌వసాయ చ‌ట్టాల వివాదం ముదురుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఢిల్లీ స‌రిహ‌ద్దుతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం వారితో చ‌ర్చ‌లు జ‌రిపినా వారు మాత్రం విన‌డం లేదు. దీంతో ఏం చేయాల‌న్న దానిపై మోడీ స‌ర్కార్ సిద్ద‌మ‌వుతోంది.

రైతుల‌కు ఈ చ‌ట్టాల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది త‌ప్ప కీడు జ‌ర‌గద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. రైతు చట్టాలపై తమతో విభేదించే వారితో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాజకీయాలు చేసే పార్టీలతో తమకు ఎలాంటి సమస్యా లేదన్నారు. అయితే, రైతులను తప్పదారి పట్టించవద్దని విపక్షాలను ఆయన కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకించే వారితో చర్చలకు తమ సర్కార్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తాజా వ్యవసాయ చట్టాలకు పలు పార్టీలు ఇంతకుముందు మద్దతు పలికాయన్నారు. దానిపై మా వద్ద లిఖతపూర్వక సాక్ష్యాలున్నాయన్నారు.

ఒక రాజకీయ నేత ప్రజలను తప్పదారి పట్టిస్తున్నాడు. ఆయనకు కనీసం ప్రజాస్వామ్యంపై కూడా నమ్మకం లేదు. ఆయనకు విదేశాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ అలా ఉంచితే, రైతు అంశాలపైనే కాకుండా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారితో అంశాలు, నిజాలు, లాజిక్‌ల ప్రాతిపదికగా చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని మోదీ అన్నారు. మాకు మాత్రమే జ్ఞానం ఉందని మేము చెప్పడం లేదు. చర్చిద్దాం. ప్రజాస్వామ్యం అప్పుడే పరిఢవిల్లుతుంది. అన్ని అంశాలపైన అరమరికలు లేకుండా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని ప్రధాని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here