పరవాడ ఫార్మాసిటీలో భారీ పేలుడు..!

ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటనను విశాఖ ప్రజలు ఇంకా మర్చిపోకముందే..  పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని సాల్వెన్సీ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక శకటాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గాయపడినట్లు సమాచారం. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పరవాడ  ఫార్మాసిటీలోని వేరువేరు కంపెనీలో మందులు తయారు చేసే క్రమంలో వచ్చే ఒక రకమైన వృథా ఆయిల్‌ను తిరిగి శుభ్రం పరిచే ప్రక్రియ ఈ కంపెనీలో జరుగుతుంది. ప్రతి రోజు మాదిరిగానే రాత్రి పది గంటలకు నైట్‌ షిఫ్ట్‌ మొదలైన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల రసాయన వాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన సాయినాథ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here