ప్రభాస్ స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడా..?

ఏదో స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని చెబుతున్న ప్ర‌భాస్ ఇచ్చేశారు. అభిమానులంతా సంబ‌ర‌ప‌డేలా త‌న 22వ సినిమాను ప్ర‌క‌టించేశారు. ఆది పురుష్ సినిమా చేస్తున్న‌ట్లు చెప్పేశారు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

తానాజీ సినిమాతో వంద‌ల‌కోట్లు కొల్ల‌గొట్టిన డైరెక్ట‌ర్ ఓంరౌత్‌తో ప్ర‌భాస్ సినిమా చేయ‌బోతున్నారు. అయితే ఈ సినిమాలో రామాయ‌ణ‌గాధ‌ను ఎంచుకోవ‌డం విశేషం. టీ సిరీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆదిపురుష్‌.. చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండుగ‌లా జ‌రుపుకుందాం అనేది క్యాప్ష‌న్‌.

రాధే శ్యామ్ బ్యాలెన్స్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్ర‌భాస్‌కు త‌ర్వాత నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్టు ఉంది. అయితే ఇంత ముందుగానే మ‌రో భారీ సినిమాను ప్ర‌భాస్ ఓకే చెప్పేశాడు. ఈ సినిమా డైరెక్ట‌ర్ ఔరంత్ ఇప్ప‌టివ‌ర‌కు రెండు సినిమాలో చేశారు. 2015లో మ‌రాఠీ భాష‌లో లోక‌మాన్య ఏక్ యుగ్ పురుష్ సినిమాను తీసి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్నారు.

ఆ త‌ర్వాత తానాజీ సినిమా తీశారు. అయితే రెండు సినిమాలు మంచి హిట్ సాధించాయి. ఇప్పుడు ప్ర‌భాస్ తో సినిమా ప్లాన్ చేశారంటే ఏ రేంజ్‌లో ఉంటుందో అభిమానుల అంచ‌నాల‌కే వ‌దిలేయాలి. అయితే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌, మ్యూజిక్ డైరెక్టర్ ఎవ‌రో ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here