పండిట్ జ‌స్రాజ్ ఇక‌లేరు..

త‌న గానామృతం ద్వారా భార‌త‌దేశ కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు పండిట్ జ‌స్రాజ్ (90) క‌న్ను మూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయ‌న మృతిప‌ట్ల రాష్ట్రప‌తి రామ్‌నాధ్‌కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంతాపం తెలియ‌జేశారు.

1930 జ‌న‌వ‌రి 28న హ‌రియాణాలోని హిస్సార్ ప్రాంతంలో జ‌స్రాజ్ జ‌న్మించారు. శాస్త్రీయ సంగీతానికి విశేష సేవ‌లు చేశారు. భార‌తీయ శాస్త్రీయ సంగీతానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ విభూష‌ణ్ అవార్డులు వ‌చ్చాయి. 80 ఏళ్లుగా సంగీత ప్ర‌పంచానికి సేవ‌లు అందించారు. ఈయ‌న లేర‌న్న వార్త‌ను సంగ‌తాభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

గాయ‌కుడిగా మాత్ర‌మే కాకుండా సంగీత గురువుగా కూడా ఆయ‌న సేవ‌లు అందించారు. ప్ర‌ముఖ సంగీత క‌ళాకారులు సంజీవ్ అభ‌య్ శంకర్‌, సుమ‌న్ ఘోష్‌, క‌ళా రామ్‌నాథ్ త‌దిత‌రులు ఈయ‌న వ‌ద్ద శిష్య‌రికం చేసిన వారే. నాసాకు చెందిన జెట్ ప్రొప‌ల్ష‌న్ లేబ‌రోట‌రీ సౌర‌మండ‌లానికి వెలుప‌ల ఉన్న ఒక చిన్న ఉప‌గ్ర‌హానికి జ‌స్రాజ్ పేరును నామ‌క‌ర‌ణం చేసింది.

ఈయ‌న మృతిప‌ట్ల రాష్ట్రప‌తి స్పందిస్తూ ఎంతగానో బాధించింద‌న్నారు. ప్రధాని మోదీ ఓం శాంతి అని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here