ఎయిమ్స్‌లో అమిత్ షా..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. ఆగ‌ష్టు 2న ఆయ‌న‌కు కరోనా నిర్ధార‌ణ కాగా హాస్పిట‌ల్‌లో చేరారు. అయితే క‌రోనాను జ‌యించిన ఆయ‌న త‌ర్వాత హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అయితే రాత్రి ఉన్న‌ట్టుంటి శ్వాస‌కోశ ఇబ్బందులు రావ‌డంతో ఆయ‌న్ను వెంట‌నే ఎయిమ్స్‌లో అడ్మిట్ చేశారు. ఈయ‌న‌కు డాక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా వైద్య బృందం నేతృత్వంలో చికిత్స జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. రెండు మూడు రోజులుగా ఒల్లు నొప్పుల‌తో ఆయ‌న బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిట‌ల్‌లో చేరారు. ఈ నెల 14న క‌రోనా నుంచి ఆయ‌న కోలుకున్నారు. అయితే మళ్లీ శ్వాస కోశ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలిసింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆయ‌న ఆరోగ్యం ప‌ట్ల వైద్యులు ఎప్ప‌టిక‌ప్పుడు బులిటెన్ విడుద‌ల చేస్తున్నారు. ఆరోగ్యంగానే ఉన్న అమిత్‌షా హాస్పిటల్ నుంచే విధులు నిర్వ‌హిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here