ఆ బ్రాండ్ కి సంతకం పెట్టిన బాహుబలి ప్రభాస్ .. ఇండియా లోనే పెద్ద బ్రాండ్ :

బాహుబలి సీరీస్ దెబ్బతో జాతీయ స్థాయి లో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్ అత్యుత్తమ నటుడు గా మారిపోయాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ డెడికేషన్ మామూలుగా లేకపోవడం చివరికి బాలీవుడ్ జనాలని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ హీరోతో సినిమా చెయ్యాలి అని డైరెక్టర్ లూ నిర్మాతలు హీరోయిన్ లూ ఆసక్తి చూపిస్తూ ఉన్నట్టే పలు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని ఆయన్ను గత కొన్నేళ్లుగా కోరుతున్నాయి. చాలా ఆఫర్లని తిరిగి నో చెప్పేసిన ప్రభాస్ తాజాగా జియోని సంస్థ కి బ్రాండ్ అంబాసడర్ గా ఓకే చెప్పాడు.

ఈ బ్రాండ్ కి ప్రస్తుతం కోహ్లీ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. అతన్ని తీసి ప్రభాస్ ని త్వరలో పెడతారు అని  వినిపిస్తోంది. సుజీత్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here