బాహుబలి భయం పోయిందే ..

బాహుబలి రెండు పార్ట్ లూ తెలుగు సినిమా చరిత్ర ని ప్రపంచానికి చాటి చెప్పాయి కానీ తెలుగు నిర్మాతల్లో మాత్రం గుబులు పుట్టించాయి. బాహుబలి చుట్టుపక్కల తమ సినిమాలు విడుదల చేస్తే బాహుబలి తో పోలుస్తూ అన్నీ రొటీన్ సినిమాలు అని తీసి పరేసేవాళ్ళు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం తరవాత వచ్చిన ప్రతీ సినిమా నుంచీ కొత్తగా ఎదో ఒకటి ఆశిస్తున్నారు జనాలు. అన్ని సినిమాలూ బాహుబలి లెవెల్ లో అనుభవం ఇవ్వలేవు అని అర్ధం చేసుకోలేని సగటు ప్రేక్షకుడితోనే వచ్చింది అసలు చిక్కు. ఇప్పుడిప్పుడే బాహుబలి భయం అందరిలో నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
ఆ సినిమా ఇంకా ఆరవ వారం లో కూడా కలక్షన్స్ రాబడుతూ ఉన్న తూర్ణం లో రాధ, కేశవ మంచి ఓపెనింగ్‌ తెచ్చుకుని తర్వాత నెమ్మదించినా, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ రెండవ వారంలోను స్టడీ కలక్షన్లతో హిట్ సినిమా అనిపించుకుంది. అందగాడు కూడా ఈ మధ్యన సినిమాల్లో హిట్ ప్రోగ్రాం పెట్టేసుకుంది. సో నెమ్మదిగా బాహుబలి భయాన్ని చాలా వరకూ తగ్గించుకున్నారు జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here