డీజేతో స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తోన్న అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైన‌మిక్ డైర‌క్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా `డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రం ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన 24గంట‌ల్లోనే యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లో క‌లిపి  7.4 మిలియ‌న్ల మంది చూడ‌టం విశేషం.
 యూత్ ఐకాన్‌గా త‌న స్టైల్స్ తో కుర్ర‌కారును ఆక‌ట్టుకునే అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మ‌ణ కుర్రాడిగానూ, స్టైలిష్ ఆఫీస‌ర్‌గానూ రెండు లుక్కుల్లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దానికి తోడు ట్రైల‌ర్‌లో హ‌రీశ్ శంక‌ర్ రాసిన పంచ్ డైలాగుల‌కు విప‌రీత‌మైన స్పంద వ‌స్తోంది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట కూడా చూడ్డానికి క‌నువిందుగా ఉంది. దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో మేకింగ్ వేల్యూస్ కూడా అదే రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి ఈ సినిమాకు అన్ని వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ద‌క్షిణాదిన బాహుబ‌లి:  ది కంక్లూజ‌న్ త‌ర్వాత ఇంత భారీ స్థాయిలో వ్యూస్‌ను తెచ్చుకున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here