సౌందర్య అప్పుడు చేసిన పనికి ఇప్పుడు జనం భయ పడుతున్నారు

సౌందర్య రజినీకాంత్ అనే పేరు వినగానే తెలుగు , తమిళ డిస్ట్రిబ్యూటర్ ల మనస్సులో రైళ్ళు పరిగెడతాయి. ఆ రేంజ్ లో షాక్ ఇచ్చింది ఆమె జనాలకి. రోబో లాంటి సూపర్ సక్సెస్ తరవాత తండ్రి రజినీకాంత్ తో యానిమేషన్ సినిమా అంటూ విక్రమ సింహ సినిమా తీసి జనాల మతులు పోగొట్టింది ఈమె. మోషన్ క్యాప్చర్ తో ఇప్పటి దాకా ఎవ్వరూ తీయని ఒక సినిమాని ఆమె దర్సకత్వం లో తీసిన సౌందర్య రిజల్ట్ తో రజినీకాంత్ కొంప ముంచేసింది. అప్పటి అప్పులు ఇంకా తీరని రజిని ఆమెని ఇన్ డైరెక్ట్ గా చాలా సార్లు దెప్పి పొడిచాడు కూడా.

రెండేళ్ళ గ్యాప్ తరవాత సౌందర్య మళ్ళీ డైరెక్షన్ లో వేలు పెట్టింది. వీ ఐ పీ సినిమా కి సీక్వెల్ గా రెండో పార్ట్ తీస్తున్న ఆమె తెలుగు , తమిళం లో బాగా క్రేజ్ ఉన్న ఈ సినిమా టీజర్ ని విడుదల చెయ్యబోతోంది.  వీఐపీ2 టీజర్ ను రిలీజ్ చేశారూ . ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here