ప్ర‌భాస్ కొత్త సినిమా..?

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ఓ సినిమా పూర్త‌వ్వ‌కుండానే మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఆయ‌న చిత్రం రాథేశ్యామ్ సినిమా ఫస్ట్ లుక్ మాత్ర‌మే రిలీజైంది. జిల్ రాధాకృష్ణ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది.

ప్ర‌భాస్ రాథేశ్యామ్ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయింది. షూటింగ్ ప్రారంభించ‌గానే ప్ర‌భాస్ ఈ సినిమా కంప్లీట్ చెయ్యాల‌ని చూస్తున్నారు. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ సినిమాలో న‌టించ‌నున్నారు. అయితే ఈ సినిమాలు ఇంకా పూర్తి కాక‌ముందే కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ మూవీ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్‌తో ప్ర‌భాస్ సినిమా చేయనున్నారంట‌.

కేజీఎఫ్‌తో ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌. ఇక బాహుబ‌లి ప్ర‌భాస్ గురించి మ‌నం చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి వీరిద్దరు క‌లిసి సినిమా చేస్తే ఇక అభిమానుల‌కు పండ‌గే. మ‌రి ఈ విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమా చేస్తున్నారు. ఆ త‌ర్వాత ఈయ‌న ఎన్టీఆర్‌తో సినిమా చేస్తార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ప్ర‌భాస్ తో సినిమా ఫిక్స్ అయితే ఎన్టీఆర్ మూవీ త‌ర్వాత ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. మ‌రి ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందో లేదో చూద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here