రెచ్చ‌గొట్టొద్దు చంద్ర‌బాబూ….

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడుపై మాల కార్పోరేష‌న్ చైర్మ‌న్ పెద‌పాటి అమ్మాజీ, మాదిగ కార్పోరేష‌న్ చైర్మ‌న్ క‌న‌క‌రావు మాదిగ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మాజీ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ద‌ళిత యువ‌కుల‌ను రెచ్చ‌గొట్టొద్ద‌న్నారు.

దేశ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ద‌ళిత యువ‌కుడి శిరోమండ‌నం కేసులో వెంట‌నే అరెస్టు చేసి రిమాండుకు పంపార‌ని తెలిపారు. ప్ర‌కాశం జిల్లాలో ద‌ళిత యువ‌కుడిపై దాడి చేసిన వారిని వెంట‌నే స‌స్పెండ్ చేశార‌న్నారు. చంద్ర‌బాబు ద‌ళితుల‌ను నీచంగా చూశార‌న్నారు. మాదిగ కార్పోరేష‌న్ చైర్మ‌న్ క‌న‌క‌రావు మాదిగ మాట్లాడుతూ చంద్ర‌బాబు పెయిడ్ ఆర్టిస్టుల్లో హర్ష‌కుమార్ ఒక‌ర‌న్నారు.

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో రాష్ట్రంలో ద‌ళితుల‌పై దాడులు జ‌రిగాయ‌న్నారు. సీఎం జ‌గ‌న్ ద‌ళిత ప‌క్ష‌పాతి అన్నారు.  ఏడాది కాలంలో ఎస్సీ సంక్షేమంపై చ‌ర్చ‌కు తాము సిద్దంగా ఉన్నామ‌ని.. మాతో చ‌ర్చ‌కు హ‌ర్ష‌కుమార్, టిడిపి సిద్ధ‌మా అని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here