మరో రికార్డు సాధించిన మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రో రికార్డు సాధించారు. కాంగ్రేసేతర ప్ర‌ధానిగా ఎక్కువ కాలం ప‌నిచేసిన వ్య‌క్తిగా ఆయ‌న రికార్డు నెల‌కొల్పారు.

భార‌త మొద‌టి ప్ర‌ధాన మంత్రి జ‌వ‌హార్ లాల్ నెహ్రూ 17 సంవ‌త్స‌రాల పాటు అత్యున్న‌త ప‌ద‌వి చేప‌ట్టి దేశంలో ఎక్కువ కాలం ప‌నిచేసిన ప్ర‌ధానిగా రికార్డు సాధించారు. అనంత‌రం ఆయ‌న కుమార్తె ఇంధిరా గాంధీ 16 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌ధానిగా ఉన్నారు. ఆ త‌ర్వాత మ‌నోహ్మ‌న్ సింగ్ వ‌రుస‌గా రెండు సార్లు ప్ర‌ధానిగా పూర్తి స్థాయి ప‌ద‌వీ కాలం ప‌నిచేశారు.

ఇప్పుడు మోదీ కూడా రికార్డుకెక్కారు. దేశంలో అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ప‌నిచేసిన వారిలో మోదీ నాల్గో స్థానంలో నిలిచారు. జ‌వ‌హార్‌లాల్ నెహ్రూ త‌ర్వాత ఐదేళ్ల కాలం ప‌ద‌వీ కాలం పూర్త‌యిన త‌ర్వాత వ‌రుస‌గా రెండో సారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిలో మ‌న్మోహ‌న్ సింగ్ ఆ త‌ర్వాత న‌రేంద్ర‌మోదీ మాత్ర‌మే.

అట‌ల్ బిహార్‌ వాజీపేయి ప్ర‌ధానిగా 2268 రోజులు వ్య‌వ‌హ‌రించ‌గా.. ఇప్పుడు మోదీ ఆ రికార్డు చెరిపేశారు. భార‌త 14వ ప్ర‌ధానిగా మోదీ 2014 మే 26న ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇటీవ‌లె దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నేత‌ల్లో ఆయ‌న మొద‌టి స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే కార్వీ ఇన్‌సైట్స్  మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరిట ఈ  ఓ స‌ర్వే చేపట్టింది. ఇందులో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిగా, ఆయ‌నే మ‌ళ్లీ ప్ర‌ధాన మంత్రిగా ఉండాల‌ని 66 శాతం మంది ప్ర‌జ‌లు కోరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here