క‌రోనా పేషెంట్ల‌తో చెవిరెడ్డి మీటింగ్‌..

తిరుప‌తిలోని కోవిడ్ హాస్పిట‌ల్‌కి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి వెళ్లారు. కోవిడ్ పేషెంట్ల‌తో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆసుప‌త్రికి రావ‌డంతో పేషెంట్లంతా ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

తిరుప‌తిలోని కోవిడ్ హాస్పిట‌ల్స్‌లో అందుతున్న వైద్య సేవ‌లు, సౌక‌ర్యాల గురించి తెలుసుకునేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి కోవిడ్ ఆసుప‌త్రికి వెళ్లారు. పీపీఈ కిట్లు ధ‌రించి డాక్ట‌ర్ల‌తో క‌లిసి ఆయ‌న అక్క‌డ‌కు వెళ్లారు. కోవిడ్ ఆసుపత్రి మొత్తం తిరిగి 330 మంది పేషెంట్ల‌తో స్వ‌యంగా క‌లిసి మాట్లాడారు. సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో ఇలా మీతో మాట్లాడ‌టానికి వ‌చ్చాన‌న్నారు.

క‌రోనా సోకిన వారికి మెరుగైన సేవ‌లు అందించాల‌న్న‌దే సీఎం ఉద్దేశమ‌ని ఈ సందర్బంగా చెవిరెడ్డి అన్నారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌తి రోజూ కోవిడ్ ప‌రిస్థితి, హాస్పిట‌ల్స్ ప‌నితీరుపై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌న్నారు. కరోనాకు ఎవ్వ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని.. చికిత్స తీసుకుంటే త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న పేషెంట్ల‌కు భ‌రోనాను ఇచ్చారు. స్విమ్స్ కోవిడ్ హాస్పిట‌ల్‌లో మంచి వైద్య సేవ‌లు అందుతున్నాయ‌న్నారు. కోవిడ్ హాస్పిట‌ల్స్‌లో ఏమైనా లోపాలుంటే వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here