సాహూ కంటే ముందే వేరొక సినిమా దింపుతున్న ప్రభాస్

బాహుబలి సినిమా భారీ విజయంతో ప్రపంచ సినీ ప్రేక్షకుల కళ్ళను తనవైపు తిప్పుకొన్నడు హీరో ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో సాహూ సినిమా చేస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్టు కొట్టాలని సాహో సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించవలసిన నేపథ్యంలో సినిమా చాలావరకు ఆలస్యమవుతుంది.

దీంతో ప్రభాస్ సాహో కంటే ముందే ఒక సినిమాను ఫినిష్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గట్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడట. జిల్ దర్శకుడు రాధా కృష్ణ గత ఏడాది చెప్పిన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రభాస్ కి చాలా నచ్చింది. ఆ సినిమా ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదట. కేవలం ఆరు నెలల్లో ఫినిష్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలని ప్రభాస్ గట్టి పట్టుదల మీద ఉన్నాడట. కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here