చంద్రబాబు నాయుడును ఇంకోసారి సీఎం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ అవుతుంది: ఎంపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరు వేరు. ముక్కుసూటి రాజకీయాలు మరియు నోటి భాష చాలా విచిత్రంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యర్థులను వ్యంగంగా విమర్శించి ఇరుకునపెడతారు. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుతం గత ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీలలో 10శాతం మాత్రమే అమలు చేశారని, మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి, ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు, నిధులు లేకుండా ప్రాజెక్టులు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించామన్నారు. సీఎం దేవుడు కాదు కాదా..ఏపీ ప్రజలు రెండోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. అయితే ఈ క్రమంలో వైసిపి నాయకులు స్పందిస్తూ తెలుగుదేశం నాయకులు మళ్లీ అబద్దపు హామీలు మొదలుపెడతారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here