ఇంకా అజ్ఞాతవాసి సినిమాకు విడని కాపీ కష్టాలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో సినిమా మీద అభిమానులు పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా గల్లంతయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమాను మిగిల్చిన నష్టాలు సినిమా కొన్నా వారిని రోడ్డు మీద పడేశాయి, అంతేకాకుండా ఈ సినిమా ఓ ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కడంతో ఆ సినిమా దర్శకుడు జెరోమ్ సల్లే తమ సినిమాను కాపీ కొట్టి ఈ చిత్రాన్ని తీసారని ఈ విషయంలో ఎదో ఒకటి తేలే వరకు పోరాడుతానని అంటున్నాడు.

ఇప్పటికే అయన కోర్టు నోటీసులు పంపించాడని తెలిసింది. నోటీసులు ఇచ్చి రెండు వారాలు అవుతున్నా కూడా సదరు దర్శక నిర్మాతలనుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు దర్శకుడు ఈ విషయం పై సీరియస్ అవుతున్నాడు.ప్రస్తుతం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడట ఫ్రెంచ్ దర్శకుడు. ఇక కొన్ని రోజుల చూసి తరవాత అరెస్టు దిశగా చర్యలు చేపట్టాలని అనుకొంటున్నాడు ఫ్రెంచ్ దర్శకుడు. మరి ఈ కాపీ గొడవ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో ముందు ముందు చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here