రామ్ కొత్త సినిమా

టాలీవుడ్ ఎనేర్జటిక్ స్టార్ రామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో. ఇండస్ట్రీలో హీరో రామ్ తిరు డిఫరెంట్. అయితే చాలాకాలం ఫ్లాపులు పలకరించాయి ఈమధ్య మొదట్లో హీరో రామ్ కు వరుస విజయాలు పలకరించాయి. అయితే ఈ క్రమంలో చాలా కాలం తర్వాత నేను శైలజ సినిమా తో హిట్టు కొట్టాడు హీరో రామ్.

ఈ సినిమా విజయంతో వెంటనే రెండు సినిమాలు చేశాడు హీరో రామ్ చేసిన రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవడంతో రామ్ కొద్ది కాలం గ్యాప్ చేసుకుని సరైన కథ కోసం వెయిట్ చేశాడు. అయితే తాజాగా త్రినాథరావు నక్కినతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రామ్. ‘సినిమా చూపిస్త మావ’ .. ‘నేను లోకల్’ తరువాత త్రినాథరావు చేస్తోన్న సినిమా ఇది.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని రామ్ మంచి కసిమీద వున్నాడు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here