వామ్మో : సాహో లో ప్రభాస్ విలన్ !!

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్  హిట్టు కొట్టి దేశంలో ఉన్న అన్ని సిని ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా సాహో అనే సినిమాను చేస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ప్రస్తుతం ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకొస్తుంది. ఈ క్రమంలో సాహో సినిమాలో ప్రభాస్ పాత్ర నెగిటివ్ షేడ్ లో ఉంటుందని టాక్. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు.

అయితే సినిమా మొత్తంలో నెగిటివ్ షేడ్ లో ఉంటుందని  చివరిదాకా హీరో మంచోడా .. చెడ్డోడా అన్నది తెలియకుండా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాను భారీ సాంకేతిక పరిజ్ఞానంతోతెరకెక్కించడం జరుగుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాను అనేక భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here