అల్లు అర్జున్ మామూలు స్కేచ్ వెయ్యలేదు .. కుమ్మేసాడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్ళిపోతున్నడు  అల్లు వారి అబ్బాయి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. ఈ క్రమంలో ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఫస్ట్ ఇంపాక్ట్ చూసినా ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ యాక్షన్ కు ఫిదా అయిపోయారు. బన్నీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ ద్వారా అర్థమైంది ప్రేక్షకులకు. మరియు అదే విధంగా ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ యూట్యూబ్ లో అనేక రికార్డులు కూడా సృష్టించింది.

తాజాగా నాపేరు సూర్యని ఇండియాలోని 7 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహకాలు చేసున్నారు. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న సబ్జెక్టు కాబట్టి అందరికి ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం మంచి రిజల్ట్ ఇస్తే ప్రభాస్ తరువాత దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పరుచుకున్న తెలుగు హీరోగా బన్నీ అవతరిస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here