ప్రేరణ జోడి విక్రమాదిత్య..!

ప్రభాస్‌ హీరోగా జిల్‌ ఫేమ్‌ రాధా కృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం అందరూ ఎదరుచూస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ అందమైన ప్రేమ కథ బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అక్టోబర్‌ 23న ప్రభాస్ పుట్టిన రోజనే విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఒక సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేస్తోంది. అయితే అభిమానులకోసం రెండు రోజుల ముందే మరో అప్‌డేట్‌ను అందించారు. రాధే శ్యామ్‌లో ప్రభాస్‌ లుక్‌ను తొలిసారి విడుదల చేశారు. హ్యాండ్సమ్‌ లుక్‌లో కారుపై కూర్చొని కిందికి చూస్తున్న ప్రభాస్‌ ఫొటోను విడుదల చేసిన చిత్రయూనిట్‌ యంగ్‌ రెంబల్‌ స్టార్‌కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్డే పాత్ర అయిన ప్రేరణను పరిచయం చేసిన చిత్ర యూనిట్‌ ఇప్పుడు ప్రేరణ జతగాడైన ‘విక్రమాదిత్య’ పాత్రను పరిచయం చేశారు. ఈ లెక్కన ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో నటిస్తున్నాడన్నమాట. మరి చిత్రానికి ‘రాధేశ్యామ్‌’ అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారన్నదానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here