అరుదైన ఘనత సాధించిన ‘ఎఫ్‌2’..!

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కిన ‘ఎఫ్‌2’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ల నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమాగా వచ్చిన ఈ చిత్రం 2019 హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.30 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఇక ఇదిలా ఉంటే విడుదలైన ఏడాదిన్నర తర్వాత ఎఫ్‌2 మరో అరుదైన ఘనతను సాధించింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. 51వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుక‌ల్లో భాగంగా .. ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరిలో ఎఫ్2కు జాతీయ అవార్డు ల‌భించింది. ఈ అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమాగా ఎఫ్2 నిల‌వ‌డం విశేషం. తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అనిల్‌రావిపూడి ఎఫ్‌2 సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here