కాజల్‌కు కాబోయే వాడిని గుర్తించారా.?

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ వివాహంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈనెల 30న స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకోనున్నట్లు స్వయంగా ప్రకటించింది. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్‌తో కాజల్‌ గత కొన్ని రోజులుగా డేటింగ్‌లో ఉన్నట్లు కాజల్‌ పోస్ట్‌ చేసిన ఫొటోలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వివాహానికి సమయం దగ్గరపడుతుండడంతో పెళ్లికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో అత్యంత సన్నిహితుల నడుమ వివాహాన్ని చాలా సింపుల్‌గా నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 30న జరిగే వివాహ వేడుకకు కేవలం 20 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. కాజల్‌ ఇంట్లోనే పెళ్లి వేడుక జరగనుంది. కేవలం కుటుంబ సభ్యుల మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కొత్త జంట తమ కొత్తింటిని సర్దుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తీసిన పొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన కాజల్‌.. ‘మా కొత్త ఇంటిని సర్దకుంటున్నాం. ఏమైనా సలహాలు ఇవ్వగలరా’ అంటూ క్యాప్షన్‌ను  జోడించింది. అంతేకాకుండా.. ‘మిస్టర్‌ని కూడా కొనుక్కోండి’ అంటూ పేర్కొంది. మరి ఈ ఫొటోలో కాజల్‌కు కాబోయే వరుడు ఎక్కడున్నారో మీకు కనిపించాడా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here