సుజీత్ సినిమా విషయం లో బాధ పడుతున్న ప్రభాస్ ?

ఊహించిన దానికంటే ఎక్కువగానే బాహుబలి 2 చిత్రం వసూళ్లు సాగుతున్నాయి అని చెప్పచ్చు. అతిపెద్ద ప్రభంజన గా పీకే లాంటి సినిమాలకే ఈ చిత్రం చుక్కలు చూపిస్తోంది. ప్రత్యేకించి హిందీ లో బాహుబలి కి ఇంత క్రేజ్ ఒస్తుంది అని ప్రభాస్ కూడా ఊహించలేదు. సరిగ్గా సినిమా విడుదల టైం లోనే మేడమ్‌ టుస్సాడ్స్‌లో వేక్స్‌ స్టేట్యూ కూడా ప్రభాస్ స్టాట్యూ రావడం తో అతిపెద్ద వింతగా బాహుబలి గురించి అందరూ చెప్పుకుంటున్నారు.
ప్రభాస్ చెయ్యబోయే కొత్త సినిమా గురించి నేషనల్ గా ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. బాహుబలి హీరో సోషల్‌ ఫిలిం అంటూ మళ్లీ సోషల్‌ మీడియా వైల్డ్‌ అయిపోతుంది. అంత అటెన్షన్‌ రాబట్టే చిత్రానికి ప్రభాస్‌ ఒక అనుభవజ్ఞుడిని కాకుండా యువ దర్శకుడు సుజిత్‌ని నమ్ముతున్నాడు. రన్ రాజా రన్ తో సూపర్ హిట్ కొట్టిన ఈ కుర్రాడికి పెద్ద బడ్జెట్ ని హ్యాండిల్ చేసే సీన్ లేదు అనే చెప్పాలి.
యాభై కోట్ల బడ్జెట్ ఉంటె సినిమా చెయ్యని డైరెక్టర్ తో వెయ్యి కోట్లు కొట్టిన హీరో సినిమా అంటే వింతే మరి.. తొందరపడి సుజీత్ సినిమా మొదలు పెట్టినట్టు ప్రభాస్ ఫీల్ అవుతున్నాడు అనే టాక్ కూడా ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here