ముస్లిం లకి బాహుబలి సినిమా నచ్చడం లేదు ? కోపంగా ఉన్నారు ?

ప్రేక్షకులు అందరూ ఈ మధ్య కాలం లో ఇంతగా ఎంజాయ్ చేసిన సినిమా ఏదీ లేదేమో అన్నట్టు బాహుబలి కి రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని యాంటీ ముస్లిం అంటూ కొందరు మీడియా లో మతం ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హిందూ మత సాంప్రదాయాలు మాత్రమె చూపించారు అనీ దేశం లో అత్యంత పురాతన కాలం నేపధ్యంగా ఉన్న సినిమాగా చూపించినా అందులో అన్ని మతాల ప్రస్తావనా ఎక్కడా లేదు అంటున్నారు వారు.

మతోన్మాదులు మరొక రకంగా కూడా ఈ సినిమా మీద ప్రసంసలు ఇస్తున్నారు. పీకే టైం లో యాంటీ హిందూ అంటూ ప్రచారం చేసిన వాళ్ళు బాహుబలి తో ఇంతకాలానికి యాంటీ హిందూ అనలేని ఒక భారతీయ చిత్రం వచ్చిందని, దీనిని ప్రతి హిందువు చూడాలని సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్నారు. హిందూ రాజుల ప్రస్తావన ఉన్నంత మాత్రాన హిందువుల గురించి మాత్రమే సినిమా అనుకోవడం మూర్ఖత్వం మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here