స్పెషల్ ఫ్లైట్ లో ఇటలీ వెళ్లనున్న ప్రభాస్.. !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల జోరు పెంచాడు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఇప్పటికే ఏకంగా మూడు చిత్రాలను ప్రకటించాడు ప్రభాస్. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణ కొంతమేర పూర్తయిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్ర షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఇటలీ వెళ్లనుంది.

15 రోజుల షెడ్యూల్ కోసం ప్రభాస్ టీం మళ్లీ ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానంలో ప్రభాస్ ఇటలీ వెళ్లనున్నాడని.. ఆ దేశంలో షూటింగ్ కి సంబంధించిన అన్ని అనుమతులు ఇప్పటికే పొందినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ మొదటి వారంలో ప్ర‌భాస్ ప్ర‌యాణం ఉంటుంద‌ని, అక్టోబ‌ర్ చివరికల్లా రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘ఆది పురుష్’, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఇక కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే ఏకంగా నాలుగు సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై ప్రభాస్ దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడన్నమాట.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here