శ్రీముఖి బుల్లి తెరపై కనిపించేది ఒక్క ఏడాదేనా..? 

యాంకరింగ్ కు సరికొత్త అర్థం చెప్తూ.. తన చలాకి మాటలతో, పంచ్ డైలాగ్ లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది శ్రీముఖి. ఈతరం యాంకర్లలో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి..  ఇటీవల సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇదిలా ఉంటే శ్రీముఖి బుల్లి తెరపై ఇంకో ఏడాదే కనిపించనుందా.? అంటే..  అవుననే సమాధానం వస్తుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ అమ్మ‌డు 2022లో పెళ్లి పీటలు ఎక్కేందుకు ఓకే చెప్పిందట. వెబ్ షోలు, సినిమాలు, ఇత‌ర టీవీ ప్రోగ్రామ్ ల‌కు సంత‌కం చేసిన శ్రీముఖి 2022లోపు అన్నింటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు పెళ్ల‌యిన త‌ర్వాత టీవీ షోలు, సినిమాలేవి చేయ‌కుండా త‌న స‌మ‌యాన్ని మొత్తం కుటుంబానికి కేటాయించనుందట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే శ్రీముఖి స్పందించాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here