స్టైల్ మార్చిన ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్ ఉత్సాహం..

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌క్కువ టైంలోనే ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకున్న వ్య‌క్తుల్లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఒక‌రు. బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న రేంజ్ పూర్తిగా మారిపోయింది.. ప్ర‌స్తుతం పూర్తిగా సినిమాల్లో బిజీ అయిపోయాడు ప్ర‌భాస్‌.

ప్రభాస్ ప్ర‌స్తుం స్టైల్ మార్చాడు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. డార్లింగ్‌ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కండలు తిరిగిన దేహంతో భారీగా కనిపించే ప్రభాస్ తాజా ఫొటోలో సన్నగా, ఫిట్‌గా కనిపించాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ చేస్తున్నాడు. ఇటీవలె ఇటలీలో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్.. రాముడి గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాల కోసమే ప్రభాస్ ప్రస్తుతం తన లుక్‌ను మార్చుకున్నట్టు సమాచారం. ఏదేమైనా ప్ర‌భాస్ ఏం చేసినా అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here