ఆ రాష్ట్రాల‌లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌పడుతున్నారు..

జమ్మూకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. లడఖ్ ప్రాంతంలో మంచు విస్తారంగా కురుస్తుండటంతో కేంద్ర పాలిత ప్రాంతంలో సర్కారు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో మంచు విస్తారంగా కురుస్తోంది.

భారీ హిమపాతం వల్ల నవంబరు 17న కశ్మీరులోని కుప్వారాలో ప్రాంతంలో ఓ సైనికుడు మరణించగా, మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. హిమపాతం వల్ల రాంబన్, కిష్త్వార్, అనంతనాగ్, కుల్గాం, బారాముల్లా, గాండెర్బల్ జిల్లాల ప్రజలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కశ్మీరులోని జాతీయ రహదారి 244 చింగం వైపు సింథన్ పాస్ సమీపంలో 10 మంది పౌరులు హిమపాతంలో చిక్కుకు పోయారు. దీంతో సైనికులు, జమ్మూకశ్మీర్ పోలీసులు వారిని రక్షించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాలలో భారీగా మంచుకురుస్తోంది. రాష్ట్రంలోని 8 జిల్లాలలో భారీ వర్షాలు, హిమపాతం కుస్తుస్తున్న నేపధ్యంలో అలర్ట్ ప్రకటించారు. శిమ్లా, మనాలీలో భారీగా మంచు కురుస్తోంది. మనాలీలోని అటల్ టన్నల్‌కు చెందిన నార్త్ పోర్టల్ వద్ద భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో లేహ్- మనాలీ హైవే మూసుకుపోయింది. ఫలితంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. లాహోల్ స్పీతిలో కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. కులూ, లాహోల్‌లో వరుసగా రెండవ రోజు కూడా భారీగా మంచు కురుస్తోంది. శిమ్లాలో భారీ వర్షం కురుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వతప్రాంతాలలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here