ప‌వ‌న్ సినిమా గురించి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన శృతిహాస‌న్‌..

హీరోయిన్ శృతి హాసన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ సినిమాలో శృతిహాస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. దీంతో తాను మూడోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి సినిమా చేస్తున్న‌ట్లు ఆమె నెటిజ‌న్ల‌తో చెప్పారు.

సాదార‌ణంగా తాను త‌క్కువ మంది హీరోల‌తో రెండో సారి సినిమా చేసిన‌ట్లు శృతి చెప్పారు. ర‌వితేజ‌తో సూర్య‌తో రెండు సార్లు న‌టించాన‌ని తెలిపారు. అయితే గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత కాట‌మ‌రాయుడు తీసి ఇప్పుడు మూడో సారి వ‌కీల్‌సాబ్ ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టిస్తున్న‌ట్లు చెప్పారు. జ‌న‌వ‌రి నెల నుంచి సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్లు చెప్పారు. ఇక వ‌కీల్ సాబ్ సినిమా వేణు శ్రీ‌రామ్ డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. దిల్ రాజ్‌, బోనీకపూర్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక శృతిహాస్ ఇటీవ‌లె ఓ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా నేప‌థ్యంలో చుట్టుప్ర‌క్క‌ల జ‌నాలు ఎక్కువ అవుతున్న త‌రుణంలో ఆమె ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఏదిఏమైనా ప‌వ‌న్ సినిమాలో శృతిహాస‌న్ చేయ‌డం అభిమానుల‌కు పండ‌గే. ఎందుకంటే ఇప్ప‌టికే రెండు సినిమాల్లో ఈ జోడీ చ‌క్క‌గా ఆక‌ట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here