ఎన్టీఆర్ కోసం నేను రెండు కోట్లు తీసుకున్నా అనేది అబద్ధం – పోసాని

హిందీ లో సూపర్ టీఆర్పీ తో సాగుతున్న బిగ్ బాస్ షో ని తెలుగు లో ఎన్టీఆర్ తీస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు లో ఈ షో కి దాదాపు యాభై కోట్ల బడ్జెట్ పెట్టి షూటింగ్ మొదలు పెట్ట బోతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా చెయ్యబోతున్న ఈ షో లో రెండున్నర కోట్ల పారితోషికం తీసుకుని పోసాని స్పెషల్ గెస్ట్ గా చెయ్యబోతున్నాడు అనే వార్తల నేపధ్యం లో పోసాని వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో అసలు నిజం లేదు అని ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆ షో కి సంబందించి ఏ ఒక్కరూ తనని ఇప్పటి వరకూ అప్రోచ్ అవ్వలేదు అని చెప్పుకొచ్చాడు పోసాని.

రవితేజ తమ్ముడు గురించి వివరిస్తున్న ఒక షో లో ఈ వ్యాఖ్యలు చేసారు ఆయన. మరొక పక్క ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ముంబై లో మొదలు కావాల్సి ఉంది. తెలుగు నటీ నటులు ఎవరిని ఈ షో కోసం తీసుకుంటారో ఇంకా తెలియాలి. భారీ తారాగణం తో నడిచే ఈ షో తెలుగు ప్రేక్షకులని ఎంతగా రంజింప చేస్తుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here