చారిత్రక ప్రేమికులే ‘రాధే శ్యామ్’కు స్ఫూర్తి..

ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు అందమైన లొకేషన్లలో చిత్రాన్ని మరింత అందంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా తొలిసారిగా పూజా హెగ్డే నటిస్తోంది. కరోనా కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడ్డ ఈ చిత్ర యూనిట్.. ఇటీవలే మళ్లీ చిత్రీకరణలో భాగంగా ఇటలీ వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి ఒక చిన్న హింట్ ఇచ్చింది. ఈ విషయమై పూజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర పురాణాల్లో చూపించిన రాధ పాత్ర కాదు. అయితే ఇందులో పాత్రలకు చారిత్రాత్మక ప్రేమికులే స్ఫూర్తి. నాలోని ప్రతిభను బయట పెట్టడానికి ఇది మంచి అవకాశం. నేను ఇందులో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నానని వార్తలు వస్తున్నాయి.. కానీ అది నిజం కాదు’ అంటూ తన పాత్రతో పాటు, సినిమా కథకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది పూజ. మరి ఆ చారిత్రాత్మక ప్రేమ కథ ప్రేక్షకులను ప్రేమలో పడేస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఎదురు చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here