‘రాజా టూ గ్రేట్‌’ రానుందా..?

రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బెంగాల్‌ టైగర్‌ చిత్రం తర్వాత గ్యాప్‌ తీసుకున్న రవితేజ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కారు. రవితేజ కేరీర్‌కు ఈ సినిమా మంచి ప్లస్‌ పాయింట్‌ అయింది. రాజా ది గ్రేట్‌ సినిమా విడుదలై ఆదివారంతో మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రవితేజ ట్విట్టర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

రాజా ది గ్రేట్‌ సినిమా షూటింగ్‌ సమయంలో రైలుపై దర్శకుడు అనిల్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘రాజా ది గ్రేట్‌కు మూడేళ్లు. ఎంతో అరుదైన ఈ చిత్రం నా హృద‌యానికి ఉగ్గరగా ఉంటుంది. రాజా ప్రపంచానికి న‌న్ను ప‌రిచేయం చేసిన అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు. నీతో ప‌నిచేయ‌డం ఎంతో స‌ర‌ద‌గా అనిపించింది. మ‌రో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నాను’ అంటూ పేర్కొన్నారు.

ఇక ఇదే విషయంపై స్పందించిన దర్శకుడు అనిల్‌.. ‘రవితేజతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. ధన్యవాదాలు సార్‌.. ఏదో రోజు ‘రాజా టూ గ్రేట్‌’ ఉంటుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. దర్శకుడు, హీరో సై అన్నాడు కాబట్టి త్వరలోనే రాజా ది గ్రేట్‌కు సీక్వెల్‌ రానుందని రవితేజ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here