‘మహా సముద్రం’లో మరో అందాల తార..!

‘ఆర్‌ఎక్స్‌100’తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంగా దూసుకొచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఈ టాలెంటెడ్‌ దర్శకుడు ‘మహా సముద్రం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. శర్వానంద్‌‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్‌ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌ నటిస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు అజయ్‌ భూపతి ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. అను ఇమాన్యుల్‌ కు మహా సముద్రంలోకి స్వాగతం పలుకుతూ అజయ్‌ ట్వీట్‌ చేశాడు. అజయ్‌ ట్వీట్‌ గమనిస్తే మహాసముద్రంలో అనునే లీడ్‌ రోల్‌లో నటిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇక శర్వానంద్‌ కెరీర్‌లో గమ్యం, ప్రస్థానం తర్వాత అంతటి నటన ప్రదర్శించే సినిమా ఇదేనని తెలుస్తోంది. శర్వానంద్‌ పాత్రను అజయ్‌ చాలా బలమైన పాత్రగా తీర్చుదిద్దనున్నాడట. పక్కా ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కథ విశాఖపట్నం సముద్రం నేపథ్యంలో సాగనుంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here