జగన్ ని నమ్ముకుంటే జైలు .. పొలిటికల్ పంచ్ గురించి చెప్పిన ఎమ్మేల్యే అనిత :

పొలిటికల్ పంచ్ అడ్మిన్ ని పోలీసులు రెండో సారి అరస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు తో అతన్ని పోలీసులు అరస్ట్ చేసారు. ఆమె మీద అభ్యంతకర పోస్టింగ్ లు పెట్టారు అనేది ఆమె అభియోగం. ఎస్సీ , ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి మెప్పు కోసం  తాను కేసు పెట్టలేదు అనీ అలా మెప్పు సంపాదించుకునే అవసరం కూడా తనకి లేదు అని అన్నారు .

తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని… తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. ” రవికిరణ్ చేసిన తప్పు ఏంటి అనేది స్వయంగా పోలీసులే తేలుస్తారు. జగన్ వేస్తున్న మూర్ఖపు ఎత్తులలో రవికిరణ్ లాంటి వారిని ఇరికించి బలి చేస్తున్నాడు జగన్ ” అన్నారు ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here