యాక్సిడెంట్ ఐన కారు మాయం .. కారు లో మందు బాటిల్స్ ? నారాయణ కొడుకు యాక్సిడెంట్ కేసు:

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 36 లో మెట్రో పిల్లర్ ని గుద్దుకుని చనిపోయిన సంఘటన తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో పోలీసులు మృత దేహాల్ని వెలికి తీసిన తరవాత బాడీలు అపోలో ఆసుపత్రి కి పంపించి కారుని అకక్డ నుంచి తీసేశారు. కారు కోసం చాలా మీడియా వాళ్ళు ప్రయత్నాలు చేయడం తో పోలీసులు నెమ్మదిగా కారు ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్ళి రహస్య ప్రాంతం లో పెట్టారు.
దీంతో పోలీసులను అడుగగా, తమకు తెలియదని సమాధానం చెప్పారు. దీంతో ప్రత్యక్ష సాక్షులతోపాటు, ఆ పరిసరాల్లోని వారిని అడుగగా…కారును ఎవరూ ప్రైవేటు వ్యక్తులు తరలించారన్న సమాధానం వచ్చింది. రహమత్ నగర్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న పారిశ్రామిక విద్యా సంస్థ కి చెందిన ప్రదేశం లో కారుని పెట్టారు. కారున్ని అంత సీక్రెట్ గా పెట్టాల్సిన పనేంటి అంటున్నారు అందరూ. పైగా కారులో మందు బాటిల్స్ దొరికాయి అనీ ఎయిర్ బ్యాగ్ లు సైతం పేలిపోయే అంత స్పీడ్ లో కార్ వెళుతోంది అని చెబుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here