ప్లాప్ సినిమా కోటిన్నర మిగిల్చింది..

అవసరాల శ్రీనివాస్ కి బాబు బాగా బిజీ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది అనే చెప్పాలి. ఇలాంటి సినిమాకి అవసరాల సెట్ కాదు అనే ఆమాటలు కూడా వినపడుతున్నాయి. ఎక్కువ రెమ్యునరేషన్ కి అవసరాల కక్రుత్తి పడకుండా ఉండి ఉంటె ఈ రకమైన ఇబ్బంది తలెత్తి ఉండేది కాదు అనేది వినిపిస్తున్న వాదన. శ్రీనివాస్ అవసరాల మాత్రం అసలు ప్లాప్ అయింది అని కేర్ చెయ్యడం లేదట.

ఒక డైరెక్టర్ గా ఏడాది టైం పట్టే అతనికి ఈ సినిమా కేవలం నాలుగు నెలల్లో కంప్లీట్ చెయ్యడం హ్యాపీగా ఉంది. అతనికి ఈ సినిమా కోసం కోటిన్నర పారితోషికం అందించారు. డైరెక్టర్ గా అందులో సగం కూడా రాదు మనోడికి. దర్శకుడిగా తనకి అందులో సగం కూడా పారితోషికం రాని నేపథ్యంలో ఇది సూపర్‌ డీలే కదా అన్నది అతని వాదన. ప్లాప్ అయినా కూడా ఈ రకంగా పాజిటివ్ కోణం లో ఆలోచిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతుంది అని ఊహించిన ప్రొడ్యూసర్ కి పెద్ద డిజాస్టర్ చేతిలో పడింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here