తాను , జనసేన ఓడిపోతాం అని ముందే హింట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల తాను పర్యటించిన ప్రతిచోటా తన నోటి  వెంట ఓటమి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. తనకు ఓటమి అంటే భయం లేదని పదేపదే చెబుతున్నారు .తాజాగా ఆంధ్రప్రదేశ్ చలోరే చెల్ కార్యక్రమంలో కూడా పలు చోట్ల ప్రసంగాలలో ఇదే విషయాని ప్రస్తావించడం జరిగింది.దీంతో ఇప్పుడు పవన్  ‘ఓటమి’ వ్యాఖ్యల పట్ల ఇటు  సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

తాజాగా అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌లో కూడా  పవన్ మాట్లాడుతూ జీవితం లో ఎదిగే కొద్ది శత్రువులు ఎక్కువ అవుతారని పవన్ అన్నారు.నేను రాజకీయాలలోకి రావడానికి గల కారణం దేశం మిధ ఉన్న భక్తి అని స్పష్టం చేశారు. తనకు ఓటములు కొత్త కాదని, కానీ ఓడిపోయే ముందు పెద్ద దెబ్బే కొడతానని అన్నారు.ఈ క్రమంలో పూర్తి స్థాయిలో రాజకీయాలలో అడుగు పేటక మునుపే పవన్  ఓటమి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్న చర్చ మొదలైంది.

సాధారణంగా పవన్ తన స్పీచ్ లో ఏప్పుడు సినిమాల గురించి, వ్యక్తిగత అభిరుచుల గురించి మాట్లాడతారు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకున్న  ప్రతి చోటా ఓటమి గురించి మాట్లాడుతుంటే ఇట్టివల తన పర్యటనలకు వచ్చిన ప్రతిస్పందనలకే ఈ రకంగా సమాధానం చెప్పి ఉంటారని చెబుతున్నారు.ఈ క్రమంలో రాజకీయ రంగంలో పూర్తిగా రాక ముందే పవన్ ఓటమిని అంగీకరించడం వెనక తాను రాజకీయాలకు సూటవనన్న సంకేతం కూడా అంతర్లీనంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here