హీరోయిన్ లకి కోటి ఇవ్వలేదు .. పవన్ – త్రివిక్రమ్ ఇద్దరూ యాభై కోట్లు లాగేశారు

తెలుగు సినిమాల స్పెషాలిటీ ఏంటంటే కాంబినేషన్ లు ఉంటె విపరీతమైన హైప్ ఏర్పడుతుంది. ఒక స్టార్ హీరో తో ఒక స్టార్ డైరెక్టర్ జత కట్టాడు అంటే చాలు . బడ్జెట్ కొండెక్కి కూర్చుంటుంది. పవన్ కళ్యాణ్ , మహేష్ లాంటి హీరోలకి స్టార్ డైరెక్టర్ లు తోడు అయితే బడ్జెట్ ని వంద కోట్లు దగ్గరకి చేర్చకుండా వదలరు .తాజాగా మొదలైన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సినిమా బడ్జెట్ వంద కోట్లకి చేరుకుంది. అంత ఖర్చు పెట్టి మరీ సినిమా లో ఏం చూపిస్తారు అనేది బోలెడు మందికి ఉన్న సందేహం. సినిమాకి కేవలం సగం కూడా ఖర్చు పెట్టారు.
అంతా పారితోషికం లోనే పోతుంది. సగానికి సగం హీరో డైరెక్టర్ ల కి ఇవ్వాల్సిన సొమ్ము దగ్గరే వెళ్ళిపోగా మిగిలిన దాంట్లో సినిమా తీసుకోవాలి. సర్దార్ , కాటమరాయుడు రెండింటికీ కలిపి పవన్ తీసుకున్న పారితోషికం పాతిక కోట్లు అంటున్నారు. ఈ కొత్త సినిమాకి ముప్పై కోట్ల దాకా పవన్ తీసుకుంటూ ఉండగా త్రివిక్రమ్ కి ఇరవై కోట్ల దాకా పారితోషికం అందుతోంది. హీరోయిన్ ల విషయం లో మాత్రం గీచి గీచి డబ్బులు ఇస్తున్నారు. కీర్తి సురేష్ , అనూ ఇమాన్యుయల్ హీరోయిన్ లు కాగా వారికి లక్షల్లో పారితోషికం ఇస్తున్నారు. హీరో డైరెక్టర్ కి కలిపి యాభై కోట్లు ఇస్తుండగా హీరోయిన్ లు ఇద్దరికీ కలిపి కోటి రూపాయలు దాటడం లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here