బాహుబలి 2 టికెట్ ని పొందండి ఇలా .. చాలా ఈజీ

బాహుబలి 2 కి అడ్డం వచ్చే సినిమాలు ఏవీ దగ్గరలో కనపడడం లేదు. ఆ సాహసం కోడా ఎవ్వరూ చెయ్యలేరు. బాహుబలి 2 టికెట్టు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న అందరూ నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు. మొదటి రోజు టికెట్టు కోసం ఎగబడి మరీ హడావిడి పడుతున్నారు ఒక్కొక్కరూ. ఈ సినిమాకి మొదటి రోజు టికెట్టు సాధించడం కంటే ఏం కావాలి అన్నట్టు ఉన్నారు ఒక్కొక్కరూ. కోట్లాది మంది ఆశలు పెట్టుకున్న ఈ సినిమా టికెట్ లు ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికి అయిపోతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే.

బాహుబలి టికెట్టు సంపాదించడం ఎలా అనేది ఇప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ ఇస్తున్న సూపర్ ఆఫర్. బాహుబలి మొదటి రోజు కష్టపడకుండా టికెట్టు పొందడం సాధ్యమే అంటున్నారు వాళ్ళు. బాహుబ‌లి ది బిగినింగ్ మూవీ రేపు మ‌రోసారి రిలీజ్ కానుంది.ఈ సినిమాను కొనుగోలు చేసే వారికి.. మ‌లిభాగం టికెట్ ప‌క్కా అన్న హామీ ఇవ్వ‌నున్నారు.ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా , తమిళనాడు , కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here