రాజేంద్ర ప్రసాద్ ని పక్కకి లాగేసిన లేడీస్ టైలర్ డైరెక్టర్

ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమా ప్రస్తుతం ఫస్ట్ లుక్ తో సంచలనం రేపుతోంది. ప్రీ లుక్ తో మొదలైన ఈ హడావిడి ఫస్ట్ లుక్ తో డీసెంట్ గా సాగింది. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా మొదటి భాగం అంటే లేడీస్ టైలర్ లో హీరో. మరి సీక్వెల్ కి వచ్చే సరికి రాజేంద్రుడు కనిపిస్తాడా కనిపించాడా అంటూ బోలెడు ప్రశ్నలు ఉదయిస్తునాయి. ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో హీరోకి తండ్రిగా మొదట రాజేంద్ర ప్రసాద్ నే అనుకున్నారట కానీ పారితోషికం విషయం లో కాస్తంత ఇబ్బంది ఏర్పడి రాజెంద్రుడిని పక్కన పెట్టారు అని తెలుస్తోంది.

పోనీ పారితోషికం దగ్గర తగ్గినా తన పాత్ర ని మరీ చీప్ గా చూపించడం రాజేంద్ర ప్రసాద్ కి నచ్చక కాస్త మార్పులు చెయ్యమన్నారు సో దానికీ వంశీ నో అనేసాడు. కాబట్టి ఇప్పుడు వేరే వ్యక్తిని పెట్టి లేదా తండ్రి క్యారెక్టర్ లేకుండా ఈ సినిమా కానిచ్చేసారు.  సుమంత్ అశ్విన్ మెయిన్ లీడ్ లో డిఫరెంటుగా సినిమాను తీశాడట వంశీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here