మహేష్ నిర్ణయం మీద సీరియస్ గా ఉన్న అభిమానులు

మురుగదాస్ డైరెక్షన్ లో రాబోతున్న హీరో మహేష్ బాబు తన స్పైడర్ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆ చిత్రం తరవాత కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను అనే చిత్రం లో నటించబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి పెద్ద వేట చేసిన కొరటాల శివ ఫైనల్ గా కియారా అద్వాని అనే బాలీవుడ్ బ్యూటీ ని హీరోయిన్ గా తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. సో ఈ విషయం మీద మహేష్ ఫాన్స్ పెద్ద హ్యాపీగా లేరు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్ లు మహేష్ కి ఎప్పుడూ కలిసి రాలేదు.

మురారి సినిమా తో తెలుగు లో అరంగేట్రం చేసిన సోనాలి బింద్రే ని పక్కన పెడితే బాలీవుడ్ నుంచి తెచ్చుకున్న ఏ భామలతో మహేష్ హిట్ కొట్టలేక పోయాడు. వంశీ సినిమాలో నమ్రత శిరోద్కర్.. టక్కరి దొంగలో బిపాసా బసు.. లీసా రే.. అతిథిలో అమ్రితా రావు.. ఇలా బోలెడు మంది హిందీ అమ్మాయిలతో మహేష్ రోమాన్స్ చేసాడు కానీ అన్నీ ప్లాప్ అయ్యాయి నాలుగేళ్ల క్రితం నేనొక్కడినే సినిమా కోసం ముంబై మోడల్ కృతి సనన్ ని తీసుకుంటే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది సో బాలీవుడ్ అమ్మాయిలని తీసుకోవద్దు అంటూ మహేష్ ఫాన్స్ గొడవ చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here