గత ఎన్నికలలో వాడుకుని ఇప్పుడు వదిలేశారు: పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి పార్టీ ల పై సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఈ రెండు పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ఈ రెండు పార్టీలు నన్ను వాడుకుని వదిలేశారని తన గోడు వెళ్లబోసుకున్నాడు పవన్ కళ్యాణ్.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.
టీడీపీ ఇత‌ర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమం సాగాలని ఆయన అన్నారు. అయితే ఈ క్రమంలో గుంటూరు వేదికగా జనసేన పార్టీ నిర్వహిస్తున్న 5వ వార్షికోత్సవ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో రాబోయే ఎన్నికలలో తన స్టాండ్ ఏమిటో తెలియచేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా అంశంపై సంచలనకరమైన ప్రకటన పవన్ కళ్యాణ్ చేస్తాడు అని అంటున్నారు జనసేన పార్టీ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here