ప్రత్యేక హోదా అంశంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న జగన్

వైసిపి అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో చాలా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. అయితే ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వని నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మీద ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అవిశ్వాస తీర్మానం పెడతామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ఈ క్రమంలో ఇదే అంశంపై తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్.
ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద తొలుత అవిశ్వాసం పెట్టదలచిన ఇరవై ఒకటో తేదిన కాకుండా సోమవారం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వైస్సార్సీపీ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం తర్వాత వైసీపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. తాజాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here