సంక్రాంతి కి పవన్ vs బాలయ్య vs చరణ్ పక్కా

రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న రంగస్థలం సినిమా కి షూటింగ్ చాలా ఫాస్ట్ గా సాగుతోంది. ఈ సినిమా గ్రామీణ నేపధ్యం లో రాబోతున్న సినిమా. చరణ్ పల్లెటూరు బుల్లోడుగా కనిపిస్తాడు ఈ సినిమాలో. పల్లెటూరు నేపధ్యం లో ఉన్న సినిమా అవ్వడం తో మొదట సంక్రాంతి విడుదల కే ప్లాన్ చేసారు ఈ సినిమా అయితే పవన్ – మహేష్ ఇద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ కి రాబోతున్నారు అని తెలిసి లైట్ తీసుకున్నాడు చరణ్.

 

తాజాగా మహేశ్ బాబు కొరటాల శివ ల సినిమా అప్పుడే వచ్చేలా కనపడ్డం లేదు అని న్యూస్ రావడం తో చరణ్ కూడా సంక్రాంతికి వస్తే బాగుండు అనుకున్నారు మెగా ఫాన్స్. ఇప్పుడు ఆ మ్యాటర్ నే నిజం చేస్తూ చరణ్ డిసెంబర్ పక్కన పెట్టి సంక్రాంతి లో  రావడానికి సిద్దం అయ్యాడు . సో రామ్ చరణ్ vs పవన్ కళ్యాణ్ vs బాలకృష్ణ అనే త్రిముఖ పోటీ ఉండబోతోంది సంక్రాంతి బరిలో .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here