చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభ చంద్రబాబుపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్. తాజాగా విజయవాడలో రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ…గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర విషయంలో ఏ తప్పు అయితే చేశారో..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజాధాని అమరావతి విషయంలో కూడా బాబు అదే తప్పు చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు..కేవలం సైబరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని తెలిపారు.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా..అంతే విధ్వంసం కూడా జరిగిందన్నారు.చిన్న చిన్న రైతుల నుండి తక్కువ ధరలకు కొన్న కొందరు బడా బాబులు కొన్ని కోట్లకు పడగలెత్తారని అన్నారు.ఈ క్రమంలో అభివృద్దిలో తమకు భాగం లేకుండా పాయిందన్న ఒక భావన ప్రజల్లో చేరిందని..అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని. ఇలా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ కోట్లకు కోట్లు పడగలెత్తే  రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో ఉండకుండా ప్రజలే గమనించి ఎన్నికలలో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here