జాతీయ మీడియా చానల్ ముందు చంద్రబాబు పరువు అడ్డంగా పోయింది

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ టూర్ చాలా బిజీ బిజీగా గడిచింది. విభజన నేపథ్యంలో ఆనాడు కేంద్రంలో ఇచ్చిన హామీలను అడగటం కోసం ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు జాతీయ మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ముందుకు సాగారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి గురించి ఓ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ చంద్రబాబును ప్రశ్నించారు….చంద్రబాబు ఏం చెప్పాలో తెలియక కంగారు పడిపోయారు.. సదరు న్యూస్ చానల్ రిపోర్టర్ వైసీపీ పార్టీ కనీసం లోక్ సభ సభ్యుల చేత రాజీనామా చేయించింది.
మీరు ఎందుకు చేయడంలేదు.రాజ్యసభ సభ్యుల చేత చేయిస్తే ఏమి లాభం ఉంటుంది.మరి మీరు చేయించ వచ్చు కదా రాజ్యసభ ,లోక్ సభ సభ్యుల చేత అని సడెన్ గా ప్రశ్నించడంతో అవాక్కైన చంద్రబాబు వెంటనే తేరుకొని What Am Saying అంటూ ఆంగ్లంలో మాట్లాడటం మొదలెట్టబోయాడు. అయితే ఆ రిపోర్టర్ అవకాశం ఇవ్వకుండా ఒకవైపు ప్రజల కోసం పోరాడుతున్న జగన్ పై దుష్ప్రచారం చేస్తూ మీరు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మీమీద కేసులుండటం వలనే మీరు కేంద్రాన్ని ఎదిరించడం లేదన్నది నిజామా అని ఉక్కిరిబిక్కిరి ప్రశ్నలను సంధించాడు.దీంతో బాబు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాక అక్కడ నుండి విశ్రమించాడు. రాష్ట్రంలో ఎల్లో మీడియా టైపు అనుకున్నాడు చంద్రబాబు జాతీయ మీడియా చానల్స్ ని కానీ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిష్క్రమించాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here