భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చరణ్ రావడం లేదు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా విడుదలవడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రియ రిలీజ్ వేడుక హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ వేడుక గురించి సినిమా యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ .. చరణ్ లను ముఖ్య అతిథులుగా మహేశ్ బాబు ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ మాత్రమే ఈ వేడుకకి హాజరవుతున్నాడట .. చరణ్ రావడంలేదని టాక్. ఏదో ముఖ్యమైన పని కారణంగా చరణ్ రాలేకపోతున్నాడని అంటున్నారు.
మెగా .. నందమూరి .. ఘట్టమనేని వారసులను ఒకే వేదికపై చూడాలనుకున్న అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశను కలిగించేదే. ఈ సినిమాకి మొదటి నుంచి వున్న హైప్ కారణంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారని సమాచారం. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. గతంలో కొరటాల మహేష్ కలయికలో వచ్చిన శ్రీమంతుడు బాక్సాఫీస్ దగ్గర భీభత్సంగా కలెక్షన్ల రికార్డులు సృష్టించడంతో….ఈ సినిమాపై మహేష్ అభిమానులకు ఓ రేంజ్ లో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టాలని ఉంటున్నాడు మహేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here